Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కనిపించే దేవత, కని పెంచిన అమ్మకి ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు: చిరంజీవి

Chiranjeevi wishes his mother on her birthday
Advertisement
  • నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న అంజనాదేవి
  • ఆమెతో కేక్ కట్ చేయించిన చిరంజీవి, ఇతర కుటుంబ సభ్యులు
  • చిరంజీవి నివాసంలో ఉత్సాహభరిత వాతావరణం
Advertisement
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి కొణిదెల అంజనాదేవి నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి నివాసంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. చిరంజీవి, సురేఖ, ఆయన సోదరి, ఇతర కుటుంబ సభ్యులు అంజనాదేవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమెతో కేక్ కట్ చేయించారు. దీనికి సంబంధించిన ఫొటోలను చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు. కనిపించే దేవత, కని పెంచిన అమ్మకు ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.
Advertisement
Advertisement
Anjanadevi
Birthday
Chiranjeevi
Mega Family
Hyderabad
Tollywood

More Telugu News